Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడిగా, దర్శకుడిగా అన్నింటికి మించి తెలుగు చిత్ర సీమలో అత్యద్భుత ప్రయోగాలు చేసిన నిర్మాతగా కృష్ణకి ఓ ప్రత్యేకత ఉంది. నటుడిగానూ ఆయన చేసిన ప్రయోగాలు ఇంతవరకు ఎవ్వరూ చేయలేదంటే అతిశయోక్తి లేదు. అందుకే నటశేఖర కృష్ణను సాహసాలకు మారుపేరుగా పిలుస్తారు. 'తేనే మనసులు' సినిమాతో ఆరంభమైన ఆయన సినీ ప్రస్థానం దాదాపు ఆరు దశాబ్దాలుగా అప్రహాతికంగా కొనసాగుతోంది. అశేష ప్రేక్షకలోకాన్ని అలరించిన కృష్ణ పుట్టినరోజు సోమవారం. ఆయన బర్త్‌డేని పురస్కరించుకుని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మహేష్‌బాబు పెట్టిన ట్వీట్ తన తండ్రిపై ఉన్న ప్రేమని తెలియజేసింది.
సాహసానికి మారుపేరు, మల్లెపువ్వులాంటి మనిషి సూపర్ స్టార్ కష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు - చిరంజీవి
పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి నాకు మంచి మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీద ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. - మహేష్‌బాబు