Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మొదటి వేవ్ ఉధృతి టైమ్‌లో..
తమిళ స్టార్ హీరో సూర్య
'ఆకాశం నీ హద్దురా..' సినిమా
ఓటీటీలో విడుదలై అఖండ విజయం సాధించింది.
కట్ చేస్తే..
కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం
చేస్తున్న టైమ్‌లో.. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ 'రాధే' సినిమా ఓటీటీలో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది.
స్ట్రాంగ్ కంటెంట్‌తో సూర్య సినిమా ఆడితే,
డిజాస్టర్ అయినప్పటికీ కేవలం ఇమేజ్‌తో సల్మాన్ సినిమా కాసుల వర్షం కురిపించింది.
అయితే ఈ ఇద్దరు స్టార్లు కామన్‌గా చేసింది
ఒక్కటే .. థియేటర్లలో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేసి రిస్క్ చేయటమే.
సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన 'సురారై పొట్రు' తెలుగులో 'ఆకాశం నీ హద్దురా'గా విడుదలైంది. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి అమెజాన్ ప్రైమ్ ద్వారా 200 దేశాల్లో విడుదలై విజయదుందుభి మోగించింది.
ఈ సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేస్తే, ఇక పై మీ సినిమాలను థియేటర్లలో ప్రదర్శించమంటూ ఎగ్జిబిటర్లు బెదిరించినప్పటికీ హీరో సూర్య మాత్రం ధైర్యంగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆయన స్థాయికి ఇది చాలా పెద్ద రిస్క్.
ఆ తర్వాత థియేటర్లలోనూ విడుదలై అశేష ప్రేక్షకాభిమాన్ని సొంతం చేసుకుంది.
78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికైంది. అలాగే 93వ ఆస్కార్ అవార్డుల బరిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకత్వం, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో పోటీ పడింది. ఇక ఐఎమ్‌డిబిలో అత్యధిక రేటింగ్ పొందిన మూడవ చిత్రంగా నిలిచింది.
'ది షాషాంక్ రిడెంప్షన్' (1994),
'ది గాడ్ ఫాదర్' (1972) చిత్రాల తర్వాత మూడోస్థానాన్ని ఈ సినిమా దక్కించుకుంది. ఇక పక్కా కమర్షియల్ ఫార్ములాలో రిలీజైన సినిమా 'రాధే'. సల్మాన్‌ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పే పర్ వ్యూ పద్ధతిలో జీ ప్లెక్స్‌లో విడుదలైంది. టిక్కెట్ ధర రూ.249 అయినప్పటికీ ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు, సల్మాన్ అభిమానులు ఎగబడ్డారు. దీంతో జీ ప్లెక్స్ సర్వర్ క్రాష్ అయ్యింది. విడుదలైన తొలిరోజే ఏకంగా 4.2 మిలియన్ వ్యూస్‌తో 100 కోట్ల రూపాయల్ని కలెక్ట్ చేసిందీ సినిమా. ఆకట్టుకునే కథ, కథనం లేకపోవడంతో ప్రేక్షకులకు తలనొప్పి తెప్పించిందీ సినిమా. అయినప్పటికీ సల్మాన్ చేసిన రిస్క్‌కి మంచి ఫలితమే దక్కింది.
సూర్య, సల్మాన్ రిస్క్ చేశారు..
మరి మన స్టార్ హీరోల పరిస్థితి ఏంటి?
అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకటం లేదు. మన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేద్దాం.. మీరు ధైర్యంగా ఉండండి అని నిర్మాతకు ధైర్యం చెప్పే స్టార్ కనిపించడం లేదు.
నిర్మాతలు ఆర్థికంగా చితికిపోతున్నా..
స్టార్ల ఇమేజ్‌లు, ఇగోలు
ఏమాత్రం కనికరించడం లేదు.
పైగా కొత్త ఆఫర్ల కోసం,
క్రేజీ కాంబినేషన్ల కోసం వెంపల్లాడుతున్నారు.
ఇటువంటి దయనీయ స్థితిలో
నిర్మాతల్ని ఆదుకునే 'రియల్' స్టార్స్
కోసం యావత్ తెలుగు సినీ పరిశ్రమ
ఆశగా ఎదురు చూస్తోంది.
ఈ నేపథ్యంలో 'అఖండ', 'నారప్ప', 'ఖిలాడీ', 'విరాటపర్వం', 'టక్ జగదీష్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'లవ్‌స్టోరీ' తరహాలో థియేటర్ల కోసమే వేచిచూస్తున్న ఇతర సినిమాల హీరోలు కూడా నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా ఇమేజ్‌ని బ్రేక్ చేసి, ఓటీటీ రిలీజ్‌కి రిస్క్ చేస్తారని ఆశిద్దాం.