Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ 'తీరం'. స్వీయ దర్శకత్వంలో అనిల్ ఇనమడుగు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్‌ను ఇటీవల ఫిలింనగర్ దైవ సన్నిధానంలో చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ, 'సినిమా మొత్తం ఒక హద్యమైన మ్యూజికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా యువతరానికి పూర్తి స్థాయిలో నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అనారోగ్యానికి గురికావడానికి మూడు రోజులు ముందుగా, చెన్నైలోని కోదండఫాణి సినీ స్టూడియోలో మా సినిమాలోని 'ఏంటీ ప్రేమా' అనే పాటను స్వర్గీయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు. అది సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు. 'మంచి కంటెంట్‌తో, బ్యూటిఫుల్ విజువల్స్‌తో మంచి రొమాంటిక్ థ్రిల్లర్‌గా దర్శకుడు అనిల్ ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించాడు. ఈ చిత్రం నాకు బాగా నచ్చింది. అందుకే మా సినేటెరియా బ్యానర్ ద్వారా లాక్డౌన్ తర్వాత ధియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని సినెటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్ బులెమోని అన్నారు.