Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రంగు' ఫేమ్ కార్తికేయ దర్శకత్వంలో రూపొందుతున్న నయా సినిమా 'కృష్ణలంక'. పరుచూరు రవి, నరేష్ మేడి, ఆదర్శ్, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ నటిస్తున్నారు. సోహ్లా ప్రొడక్షన్స్, చేతన్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాత పూనా సోహ్లా పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి 'ఇంట్రో ఆఫ్ కష్ణలంక' వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ మూడు నిమిషాల వీడియోలో టీజర్, ట్రైలర్లకు భిన్నంగా సినిమాలోని ప్రతి క్యారెక్టర్ తాలూకా ఎమోషన్ని ఎఫెక్టీవ్‌గా దర్శకుడు పరిచయం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రేమకి, పగకు మధ్య జరిగే యుద్ధాన్ని పరిచయం చేసింది. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ,' ఇదొక ఎమోషనల్ క్రైమ్ డ్రామా. ప్రేమ, స్నేహాం, పగ వంటి భావోద్వేగాలతో నడిచే ఈకథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. చాలా రియలిస్టిక్‌గా కథనం ఉంటుంది. హీరోయిన్ క్యాథలిన్ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ చుట్టూ కథనం సాగుతుంది. ఇందులో హీరోలుగా చేసిన నరేష్, ఆదర్శ్ పెద్దిరాజు పాత్రలు చాలా ఎగ్రెసివ్‌గా ఉంటాయి. పరుచూరి రవి పాత్రలో ఉండే మాస్ అప్పీల్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి కష్ణ సౌరభ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎమోషన్ని బాగా ఎలివేట్ చేసారు. పరిచూరి బ్రదర్స్ రాసిన కొన్ని డైలాగ్స్ వారు మాత్రమే రాయగలరు అనేంతగా వచ్చాయి' అని తెలిపారు. 'మా అంచనాలను మించి సినిమా బాగా వచ్చింది. ఒక మంచి సినిమాని నిర్మించామనే సంతప్తి ఉంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక, రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాం' అని నిర్మాత పూనా సోహ్లా చెప్పారు. మరో నిర్మాత చేతన్ మాట్లాడుతూ,' దర్శకుడు కార్తికేయ ఈ కథను డీల్ చేసిన విధానం మాకెంతో బాగా నచ్చింది. ఈ సినిమా ఇచ్చిన సంతృప్తితో తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మిస్తాం' అని అన్నారు.