Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన కథానాయికలు తమన్నా, కాజల్‌కి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ పెద్దగా అచ్చొచ్చినట్టు లేదు. డిజిటిల్ ఎంట్రీ ఇస్తూ తమన్నా 'లెవెన్త్ అవర్' వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మలి ప్రయత్నంలో కచ్చితంగా సక్సెస్ కొట్టేందుకు తమన్నా నటించిన 'నవంబర్ స్టోరీస్' థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకుల నిరాదరణ పొందింది. ఇక తమన్నా మాదిరిగానే కాజల్ పరిస్థితీ ఉంది. డిజిటల్ ఎంట్రీ ఇస్తూ కాజల్ 'లైవ్ టెలికాస్ట్' అనే హర్రర్ వెబ్ సిరీస్‌లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అయితే మలి ప్రయత్నంగా 'పేపర్బారు' ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో ఓ వెబ్ ఫిల్మ్‌లో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళబోతున్న ఈ వెబ్ ఫిల్మ్‌తో హిట్ కొట్టాలని కాజల్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట. ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య' సినిమాలో కాజల్ నటిస్తోంది.