Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ థియేటర్ వ్యవస్థని సర్వనాశనం చేస్తోంది. ఈ మహమ్మారి విజృంభణతో థియేటర్లు మూతపడ్డాయి. భవిష్యత్‌లో థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ మునుపటిలా ప్రేక్షకులు థియేటర్లకి వస్తారనే ఆశని కూడా సెకండ్ వేవ్ ఆవిరి చేసేస్తోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్‌కి ఓటీటీనే
ప్రత్నామ్నాయ మార్గంగా కనిపిస్తోంది.
దీంతో ఇప్పటికే పలువురు నిర్మాతలు ఓటీటీ వేదికగా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్ళకే పరిమితమైన ప్రేక్షకుల్ని పలు భిన్న కంటెంట్ల వెబ్‌సిరీస్‌లతో ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీలన్ని పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెలలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
అగ్ర హీరో ధనుష్, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'జగమే తంతిరం'. లోకల్ గ్యాంగ్‌స్టర్‌గా ధనుష్ నటించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ధనుష్ సరసన ఐశ్వర్యలక్ష్మీ నటించిన ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈలం తమిళులను కించపరిచారనే ఆరోపణలతో దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ఈనెల 4న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌కి సమంత ప్రధాన ఆకర్షణ. తొలిసారి సమంత తీవ్రవాదిగా పూర్తి నెగటివ్ రోల్లో నటించడం విశేషం. వీటితోపాటు 'అర్ధ శతాబ్దం' సినిమా ఆహా ఓటీటీలో ఈనెల 11న రిలీజ్ కానుంది. బాలీవుడ్ నటుడు సునీల్ గ్రోవర్ నటించిన 'సన్‌ఫ్లవర్' చిత్రం జీ5లో ఈనెల 11న స్ట్రీమింగ్ అవ్వనుంది. ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్ నటించిన 'షేర్నీ' చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 18న రిలీజ్ కానుంది. అలాగే ఇటీవల థియేటర్లలో రిలీజైన నితిన్ 'రంగ్ దే' చిత్రంతోపాటు పలు భిన్న భాషా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇదేలో నెలలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాయి.