Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ ధాటికి థియేటర్లు ఎప్పటికి ఓపెన్ అవుతాయనే విషయంలో మేకర్స్ అయోమయంలో ఉన్నారు.
దీంతో ఇప్పుడు బడా నిర్మాతలు సైతం
తమ సినిమాల్ని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు
మెల్లిగా పావులు కదుపుతున్నారు.
ఇందులో భాగంగా అగ్ర కథానాయకుడు ప్రభాస్
నటించిన 'రాధేశ్యామ్' పాన్ ఇండియా చిత్రాన్ని
ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు
ఇప్పటికే సన్నాహాలు ఆరంభించినట్టు సమాచారం.
అయితే ఈ సినిమాని 'పే పర్ వ్యూ' బేసిస్‌లో
రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ పద్ధతిలో విడుదల చేస్తే కచ్చితంగా
సేఫ్ జోన్ ఉంటామనే నమ్మకంతో నిర్మాతలున్నారట. ఇటీవల ఇదే పద్ధతిలో సల్మాన్‌ఖాన్ నటించిన 'రాధే' సినిమా జీ-ప్లెక్స్‌లో రిలీజ్ అయ్యింది. 249 రూపాయల టిక్కెట్ ధర పెట్టినప్పటికీ అటు సల్మాన్ అభిమానులు,
ఇటు ప్రేక్షకులు విపరీతంగా చూశారు.
పైగా ఓవర్సీస్లో కొన్ని థియేటర్లలోనూ రిలీజ్ అయ్యింది. దీని ఫలితంగా ఈ సినిమా విడుదలైన తొలిరోజే ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ని దాటేసింది. కథాపరంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయినా కలెక్షన్ల పరంగా
నిర్మాతల్ని మాత్రం సేఫ్ జోన్లో ఉంచింది. దీంతో 'రాధేశ్యామ్' నిర్మాతలు సైతం 'రాధే' బాటలోనే వెళ్ళాలని డిసైడ్ అయ్యారట.
అన్ని సెట్ అయితే జూలై 30న ఈ సినిమా
జీ ప్లెక్స్లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని గట్టిగా వినిపిస్తోంది.