Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా సినిమాలోని 'కన్నులు చెదిరే అందాన్ని..' పాటకి అనూహ్య స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట యూ ట్యూబ్‌లో ఇప్పటివరకు ఒక మిలియన్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుని, సినిమాపై భారీ అంచనాలను పెంచింది' అని అంటున్నారు 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల.
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా కె.వి. గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ'. ఇటీవల 'కన్నులు చెదిరే అందాన్నె వెన్నెల తెరపై చూశానే..' అంటూ ఆహ్లాదకరంగా సాగే అందమైన మెలోడీ సాంగ్‌ను యువ కథానాయకుడు అడివి శేష్ రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ గీతాన్ని యాజిన్ నిజార్ ఆలపించారు. సైమన్ కె కింగ్ స్వరాలు సమకూర్చారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ, 'మా రామంత్ర క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న తొలి చిత్రమిది. అలాగే ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు సినిమా కూడా. ఇప్పటికే విడుదలైన టీజర్, 'నైలునది..' లాక్డౌన్ ర్యాప్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'మేజర్' కథానాయకుడు అడివిశేష్గారు రిలీజ్ చేసిన 'కన్నులు చెదిరే..' లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 1 మిలియన్‌కి పైగా ఆర్గానిక్ వ్యూస్‌ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ పాటని విడుదల చేసిన అడివిశేష్, ఆదిత్య మ్యూజిక్ వారికి మా రామంత్ర క్రియేషన్స్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైవిధ్యమైన కథ, కథనంతో ఈ చిత్రాన్ని మా దర్శకుడు కె.వి.గుహన్‌గారు ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా ఆయన సత్తా ఏమిటో కచ్చితంగా తెలుస్తుంది. ఈ సినిమా హిట్ కోసం ఆయన బాగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు.
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: నిఖిల్ హాసన్, డైలాగ్స్: మిర్చి కిరణ్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా, కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్, స్టంట్స్: రియల్ సతీష్, కాస్ట్యూమ్ డిజైనర్: పొన్మని గుహన్, కో - ప్రొడ్యూసర్: విజరు ధరణ్ దాట్ల, నిర్మాత: డా. రవి పి.రాజు దాట్ల, కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె.వి.గుహన్.