Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిమానుల్ని ఉత్సాహపరచడంలో బాలకృష్ణకి మించిన స్టార్ హీరో మరొకరు ఉండరంటే అతిశయోక్తి లేదు. ప్రతి అకేషన్‌కి తన సినిమాలకి సంబంధించి ఏదో ఒక అప్డేట్స్ ఇస్తూ సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇక పుట్టినరోజు సందర్భంగా సమ్‌థింగ్ స్పెషల్ అప్డేట్ ఉండాల్సిందే. ఈసారి పుట్టినరోజుకి కూడా రెండు స్పెషల్ సర్ప్రైజ్లు ఇచ్చేందుకు బాలయ్య రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.
ఈనెల 10వ తేదీన బాలయ్య పుట్టిన రోజు నేపథ్యంలో 'అఖండ' సినిమాకి సంబంధించి ఓ కొత్త పోస్టర్ని, అలాగే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందబోయే నయా సినిమా టైటిల్‌ని లేదా ఆ సినిమాలోని బాలయ్య లుక్‌ని రిలీజ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహ', 'లెజెండ్' చిత్రాలు భారీ బ్లాక్‌బస్టర్స్‌గా విశేష ఆదరణ పొందాయి. దీంతో వీరి కాంబోలో రాబోతున్న 'అఖండ' సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండటంతో అందరిలోనూ అమితాసక్తిని రేకెత్తిస్తోంది.