Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో అత్యంత ఎక్కువ ఇష్టపడిన పోలీసు పాత్ర ఒక బ్రాండ్ న్యూ అవతారంలో దబాంగ్-ది యానిమేటెడ్ సిరీస్‌తో, అన్ని వయసుల వారికి గిలిగింతలు పెట్టే ఎంటర్టెయినర్గా డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో ప్రసారమవుతోంది
~ బాలల టైటిళ్ల కలెక్షన్‌ను వరుసగా విడుదల చేస్తూ వస్తుండగా, అందులో భాగంగా దబాంగ్ నటుడు సల్మాన్ ఖాన్ ఐకానిక్ పాత్ర ఈ సిరీస్‌తో ఘనంగా తిరిగి వస్తోంది ~
~ కాస్మోస్-మాయ మరియు అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన, ఫ్యామిలీ ఎంటర్టెయినర్ మొదటి 8 ఎపిసోడ్లు ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో ప్రసారం అవుతోంది~
సూపర్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఐకానిక్ క్యారెక్టర్ చుల్బుల్ పాండే ఇప్పుడు దబాంగ్- ది యానిమేటెడ్ సిరీస్‌తో సరికొత్త అవతారంలో డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో ప్రేక్షకుల ముందుకు తిరిగి వస్తున్నాడు. బ్లాక్ బస్టర్ బాలీవుడ్ ఫ్రాంచైజీకు అనుసరణగా, రీ ఇమేజ్‌గా ప్రసారం కానున్న ఈ యాక్షన్-కామెడీ సిరీస్ నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు చెడుపై పోరాటం చేసే పోలీసు అధికారి చుల్బుల్ పాండే దైనందిక జీవితాన్ని వివరిస్తుంది. తనకు మద్ధతుగా పోలీసు ఉద్యోగంలో అతని తమ్ముడు మక్కి చేరి, ప్రతి సమస్యాత్మక పరిస్థితిల్లో తన అన్నను అనుకరించటానికి ప్రయత్నిస్తుంటాడు. గిలిగింతలు పెట్టే ఎంటర్టెయినర్గా, ఇది పిల్లలు మరియు వారి కుటుంబాలు అందరూ ఆనందించే సిరీస్‌గా తెరకెక్కించారు. కనుక, డాబాంగ్గా సెట్ అవ్వండి మరియు అత్యంత ప్రియమైన పోలీసు అధికారిని సరికొత్త యానిమేటెడ్ రూపంలో తిరిగి స్వాగతం పలకండి.
ఈ షో సీజన్-1 మొదటి 8 ఎపిసోడ్లు హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో ప్రత్యేకంగా ప్రసారం అవుతుండగా, కొత్త ఎపిసోడ్లు క్రమం తప్పకుండా వరుసగా జోడించబడతాయి. కాస్మోస్-మాయ మరియు అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన, దబాంగ్ – ది యానిమేటెడ్ సిరీస్ కిడ్స్ కంటెంట్‌కు విస్తృతమైన కలెక్షన్ టాయ్ స్టోరీ, డోరెమాన్, మిక్కీ మౌస్ క్లబ్‌హౌస్ మరియు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ తదితర ఆల్-టైమ్ ఫేవరెట్స్ నుంచి సమకాలీన సూపర్హిట్లు సెల్ఫీ విత్ బజరంగీ, చాచా చౌదరీ మరియు సోఫియా ది ఫస్ట్ తదితరాలకు సరికొత్త చేరిక కానుంది. సురక్షితమైన, వినోదాత్మక మరియు నియంత్రిత అనుభవాన్ని నిర్ధారించేందుకు, తల్లిదండ్రులు వయస్సుకు తగిన కంటెంట్‌ను వీక్షించేందుకు ప్లాట్ఫారంలోని ప్రత్యేకమైన కిడ్స్- సేఫ్ మోడ్ ద్వారా నావిగేట్ చేయవచ్చు.
యానిమేటెడ్ అవతారంలో చుల్బుల్ పాండే ప్రేక్షకుల ముందుకు రావడం గురించి నటుడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, “చుల్బుల్ పాండే నాకు చాలా ప్రత్యేకమైన పాత్ర ఎందుకంటే ప్రేక్షకులు అతనిపై అలాగే సినిమాపై 10 ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమ కారణమని చెప్పవచ్చు. మన దేశంలోని బాలల్ని అలరించేందుకు చుల్బుల్, మక్కి మరియు రాజ్జో యానిమేటెడ్ అవతారాల్లో తిరిగి రావడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు నా మేనకోడళ్లు, మేనల్లుళ్లతో దబాంగ్ - ది యానిమేటెడ్ సిరీస్ అన్ని ఎపిసోడ్లను చూసేందుకు నేను ఉత్కంఠతో వేచి చూస్తున్నాను. ఈ పాత్రకు యానిమేషన్ మరో కోణాన్ని చూపించగా, అందుకు కాస్మోస్-మాయ చేసిన ప్రయత్నం నాకు థ్రిల్ కలిగించింది. పిల్లలందరూ, తమ కుటుంబాలతో కలిసి, సమయాన్ని గడుపుతూ, ఈ సిరీస్‌ను చూసి ఆనందించాలని’’ కోరారు.
నిర్మాత అర్బాజ్ ఖాన్ మాట్లాడుతూ “దబాంగ్ నాకు, కేవలం ఒక చిత్రం లేదా ఫ్రాంచైజీకి మించినది; ఇది సరికొత్త ఫార్మాట్లో ప్రాణం పోసుకోవడాన్ని చూడటం చాలా ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. మేము టీమ్ కాస్మోస్-మాయను కలిసిన క్షణంలో పుట్టిన ఆలోచనతో ఇది తెరకెక్కింది. వారు భారతీయ యానిమేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. మా దబాంగ్ కోసం మంచి యానిమేషన్ స్టూడియో భాగస్వామిగా వీరిని మించి మరొకరు కనిపించలేదు. బాలల నుంచి పెద్దల వరకు అందరి నుంచి వినయపూర్వకమైన అభినందనలు అందుకున్న ఆలోచనలతోనే యానిమేటెడ్ రూపంలో చుల్బుల్ పాండేని సృష్టించాము. బాలలు చాలా వినూత్నమైన ప్రేక్షకులు మరియు విమర్శకులు. ఎందుకంటే వారు తమ హృదయం నుంచి మాట్లాడతారు మరియు దబాంగ్‌ను యానిమేటెడ్ రూపంలో వీక్షించేందుకు ఆసక్తి చూపించారు. ఇదే కారణంతో తెరకెక్కించిన యానిమేటెడ్ సిరీస్ నా గొప్ప విజయాల్లో ఒకటిగా నిలువనుంది. దీన్ని బాలలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపితో కలిసి పనిచేయడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. పిల్లల తల్లిదండ్రులు తమ ఇంటి నుంచే భద్రత సౌలభ్యాలకు అనుగుణంగా ఈ ఆహ్లాదకరమైన మరియు వినోదాత్మక సిరీస్ అన్ని ఎపిసోడ్లు వీక్షించవచ్చని’’ వివరించారు.
డిస్నీ+ హాట్‌స్టార్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, “డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో కిడ్స్ కంటెంట్ లైబ్రరీకి దబాంగ్ ఒక అసాధారణమైన చేరిక కానుంది. ఇది తల్లిదండ్రులు తమ పిల్లలు చూస్తున్న వాటిని కీలకమైన నియంత్రణతో కిడ్స్-సేఫ్ మోడ్‌తో అందిస్తుంది. అన్ని వయసుల ప్రేక్షకులు సల్మాన్ ఖాన్‌ను అభిమానిస్తారు. పిల్లలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే రూపంలో అతని ఐకానిక్ క్యారెక్టర్ మరియు మూవీని తీసుకురావడం మాకు సంతోషంగా ఉంది. ప్రజాదరణ పొందిన షో కొత్త సీజన్ సెల్ఫీ విత్ బజరంగీతో పాటు విజయవంతమైన డిస్నీ టైటిల్స్ తదితర ఆకర్షణీయమైన చిత్రాలతో ఇంట్లో గడిపే సమయాన్ని వినోదభరితంగా మార్చుకోవచ్చు. మేము కాస్మోస్-మాయతో అద్భుతమైన సహకారాన్ని కలిగి ఉన్నాము మరియు బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ ఫ్రాంచైజీతో దీన్ని మరింత సృజనాత్మకంగా మరియు వినోదాత్మకంగా రీమేజిన్ చేసినందుకు మరింత ఉన్నతంగా నిర్మించామని’’ వివరించారు.
కాస్మోస్-మాయ సీఈఓ అనీష్ మెహతా మాట్లాడుతూ “పూర్తిగా భారతీయ ఐపి క్రియేషన్ అయిన కాస్మోస్-మాయ 10 సంవత్సరాల ప్రయాణంలో దబాంగ్ ఒక మైలురాయి లాంటి ఐపి లాంచ్. ‘‘ఫెమిలియారిటీ విత్ నావెల్టీ‘ అనే సూత్రానికి అనుగుణంగా పని చేస్తున్న కాస్మోస్-మాయకు ఇటువంటి ఐకానిక్ ఫ్రాంచైజీ లభించడం మాకు దక్కిన ప్రత్యేకతగా భావిస్తున్నాము. అర్బాజ్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు మరియు డిస్నీ+ హాట్‌స్టార్ వంటి అద్భుతమైన ప్లాట్‌ఫాం భాగస్వామిగా, సల్మాన్ ఖాన్‌తో ప్రాణం పోయబడిన ఈ పాత్ర నాకు వ్యక్తిగతంగా అలరించింది, కల్ట్ ఐకాన్ చుల్బుల్ పాండే కన్నా మేము మా 20వ షో కోసం ఇంతకన్నా పెద్ద, మంచి పాత్రను అడగలేమని’’ పేర్కొన్నారు.