Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎక్కడికి వెళ్తుందో మనసు' సినిమా తర్వాత గీత రచయిత డా|| వడ్డేపల్లి కష్ణ దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథ 'లావణ్య విత్ లవ్ బార్సు'. పావని టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో యోధ, కిరణ్, సాంబ హీరోలు. రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై శరత్ చెట్టి (యూఎస్ఏ) సమర్పణలో శ్రీమతి రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమా ఈనెల 6న ఊర్వశి ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు డా|| వడ్డేపల్లి కష్ణ మాట్లాడుతూ, 'మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తున్న ఊర్వశి ఓటీటీకి కతజ్ఞతలు. మా నిర్మాతలు శ్రీమతి రాజ్యలక్ష్మి.సి, నర్శింలు పటేల్ చెట్టి, శరత్ చెట్టిలకు కూడా ధన్యవాదాలు. ప్రేమ పేరుతో తన వెంట పడే మేకవన్నె పులుల నుంచి లావణ్య అనే ఒంటరి యువతి, తనని తాను రక్షించుకుని, స్వచ్ఛమైన ప్రేమను ఎలా పొందింది అనే అంశాన్ని అత్యంత వినోదాత్మకంగా, అందరి హదయాలకు హత్తుకునేలా తెరకెక్కించాం. మనసులను మైమరపించే మాటలు, పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇందులో ముఖ్య పాత్రలు పోషించిన పరుచూరి గోపాలకష్ణ, కాశీ విశ్వనాధ్ ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను. పుష్కలమైన వినోదానికి రవ్వంత సందేశం జోడించాం. మా సినిమా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రమణ తోట, సంగీతం: యశోకష్ణ, సమర్పణ: శరత్ చెట్టి (యూఎస్ఏ), నిర్మాతలు: శ్రీమతి రాజ్యలక్ష్మి.సి-నర్సింలు పటేల్ చెట్టి, కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డా|| వడ్డేపల్లి కష్ణ.