Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం 75వ జయంతి (శుక్రవారం)ని పురస్కరించుకుని యావత్ తెలుగు చిత్ర సీమ 'ఎస్పీ బాలుకు స్వరనీరాజనం' పేరుతో 12 గంటలు పాటు నిర్విరామంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలకు జరిగిన ఈ ఆన్లైన్ వేదికలో పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు బాలుతో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బాలు తనయుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ,'ఇంత గొప్ప కార్యక్రమం నాన్నగారు ఉన్నప్పుడు జరిగి ఉంటే, ఆయన ఎంతో సంతోషించేవారు. అందరూ ఇలా కలిసి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు' అని చెప్పారు. కష్ణ మాట్లాడుతూ, 'బాలుగారు చిత్ర పరిశ్రమలో తొలిసారి నా చిత్రం 'నేనంటే నేనే'కు పూర్తి పాటలు పాడారు. ఆ తర్వాత నా అన్ని సినిమాలకు ఆయనే పాడారు. మాది 50 సంవత్సరాల అనుబంధం. ఆయన 16 భాషల్లో 4 వేల పాటలు పాడి, ప్రపంచ రికార్డు సష్టించిన కళాకారుడు. అటువంటివాడు మన తెలుగువాడు అవడం మనందరి అదష్టం' అని చెప్పారు.
చిరంజీవి మాట్లాడుతూ, 'మనందరికీ అభిమాన పాత్రుడైన ఎస్పీ బాలుగారి జయంతిని అందరూ కలిసి ఒక వేదికపై ఘనంగా సెలబ్రేట్ చేయలేకపోతున్నామనే బాధగా ఉంది. నా సినిమా జీవితంలో నా సక్సెస్‌కి సగం దోహదపడ్డ బాలుగారికి నేను నివాళి అర్పిస్తున్న. అన్నయ్య కోసం వసంత స్వయంగా రాసి, పాడిన పాట ఎంతో బాగుంది. ఆ పాటను ఆమె అనుమతితో ఈ రోజు విడుదల చేస్తున్నాం. సంగీతం ఉన్నంత వరకు ఆయన చిరంజీవులై మనందరి మనస్సుల్లో ఉంటారు. ఆయన అజరామరుడు' అని అన్నారు.'బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ముడు. అమరగాయకుడు. మళ్లీ నేను సినిమా తీస్తే పాటలు ఎవరు పాడుతారు అని అనిపించే లోటును క్రియేట్ చేసిన మహా వ్యక్తి' అని కళాతపస్వి కె.విశ్వనాథ్ తెలిపారు. కృష్ణంరాజు, నాని, శ్రీకాంత్, కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, వీకే నరేష్, సి. కళ్యాణ్, ఆచంట గోపినాధ్, జె.కె. భారవి, అనంత్ శ్రీరామ్, ఎస్.పి.శైలజ, మురళీమోహన్, దేవి శ్రీ ప్రసాద్, సురేష్ బాబు, భువనచంద్ర..తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.