Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరోనా పాటిజివ్ ఉందని భయ పడకండి.. పంచ సూత్రాలు పాటించి కరోనాని జయిద్దాం' అని ధైర్యం చెబుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షరుకుమార్. ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్ఐసిసిఐ) నిర్వహిస్తున్న కరోనా అవగాహన కార్యక్రమంలో అక్షరు భాగమయ్యారు.
'కరోనా కో హరానా హై' అంటూ ఐదు ఆరోగ్య సూత్రాలతో ఉన్న ఓ వీడియోని ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 1. కరోనా బారిన పడిన వ్యక్తి.. ఇంట్లో వాళ్లతో కలవకుండా ఓ గదిలో కొన్ని రోజులపాటు ఐసోలేట్ అవ్వాలి. 2. ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలి. 3. సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు ఎల్లప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 4. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. 5. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే, వెంటనే వైద్యుడితో మాట్లాడి ఆస్పత్రికి వెళ్లాలి' అని అక్షరు ఈ వీడియోలో తెలిపారు. ఈ కరోనా అవగాహన ప్రచారంలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించి చిరంజీవి, ఆర్య, పునీత్ రాజ్‌కుమార్ సైతం భాగస్వాములు కాబోతున్నారు.