Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎట్టకేలకు బాలీవుడ్‌కి తీపికబురు అందింది. సోమవారం నుంచి 50శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సర్కార్ శనివారం అధికారికంగా ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా థియేటర్లను మూసివేశారు. అలాగే షూటింగ్‌లనూ నిలిపివేశారు. దీంతో ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో బాలీవుడ్ మునిగిపోయింది.
ఈ నేపథ్యంలో ఏవో కొన్ని సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజ్ అవ్వగా, మిగిలిన సినిమాలన్ని థియేటర్ల ఓపెనింగ్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సోమవారం నుంచి థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే సినిమా, టీవీ సీరియళ్ళ షూటింగ్‌లూ నిర్వహించుకోవచ్చు. అయితే సాయంత్రం 5 గంటల్లోపు షూటింగ్ పూర్తి చేయాలి. థియేటర్లు, షూటింగ్‌ల విషయంలో మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం ఒక్క బాలీవుడ్లోనే కాదు దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ నూతనోత్సహాన్ని నింపింది. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి తీపి కబురు అందుతుందనే ఆశాభావాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ వ్యక్తం చేసింది.