Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్లతో రూపొందబోయే సినిమాలకు సంబంధించి నయా టైటిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్టీఆర్, కొరటాల శివ, అలాగే అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబోలో తెరకెక్కబోయే సినిమాల తాలూకా టైటిల్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ టైటిల్స్ గురించి రెండు చిత్రాల మేకర్స్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.
సెన్సేషనల్
'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ కొత్త సినిమాని ఎనౌన్స్ చేసిన విషయం విదితమే. ఈ చిత్రానికి 'సెన్సేషనల్' అనే పవర్ఫుల్ టైటిల్‌ని ఎంపిక చేశారట. కథానుగుణంగా ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, కథతోపాటు ఎన్టీఆర్ క్యారెక్టర్ని జస్టిఫై చేసేలా 'సెన్సేషనల్' టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారని తెలుస్తోంది.
మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి
అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబోలో రూపొందబోయే చిత్రానికి 'మిస్ శెట్టి ..మిస్టర్ పొలిశెట్టి' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 'రారా కష్ణయ్య' ఫేమ్ మహేష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 'నిశ్శబ్ధం' తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది.