Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శోభన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రమేష్, గోపీ దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో రామన్, విక్రమ్, చంద్ర వట్టికూటి, మోహన్, మధు పగడాల, డాక్టర్ కష్ణమూర్తి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సినిమా గురించి దర్శకులు రమేష్, గోపీ మాట్లాడుతూ,' హీరో తరుణ్‌తో 'ఇది నా లవ్ స్టోరీ', ఆ తరువాత ''రెడ్డి గారింట్లో రౌడీయిజం' తీశాం. అది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఈ మధ్యే కన్నడలో ఓ సినిమా చేశాం. అది కూడా రిలీజ్‌కి రెడీగా ఉంది. మా కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రమిది. ఈ చిత్రం ద్వారా శోభన్‌ను హీరోగా పరిచయం చేస్తూన్నాం. శోభన్ ఇప్పటికే యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. లవ్, సస్పెన్స్ ఎంటర్టైనర్గా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా ఉంటుంది. లాక్డౌన్ ముగియగానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం' అని చెప్పారు.
నూతన కథానాయకుడు శోభన్ మాట్లాడుతూ,'హీరో అవ్వాలనే నా కల ఈ సినిమాతో తీరబోతోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని చెప్పారు.