Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థత కారణంగా మరోమారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆదివారం ఉదయం ఆయన్ని కుటుంబసభ్యులు ముంబయిలోని హిందుజ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనకు తగినంత ఆక్సిజన్ని అందజేస్తున్నామని, మరో రెండు మూడు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని దీలీప్కి చికిత్స అందిస్తున్న డా|| ప్రకార్, డా||గోఖ్లే తెలిపారు. వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో దిలీప్ కుమార్ తరచూ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న దిలీప్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.