Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయకుడు రక్షిత్ శెట్టి నటిస్తున్న మరో విభిన్న కథా చిత్రం '777 చార్లి'. కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. ఓ కుక్క టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నారు. కిరణ్ రాజ్.కె దర్శకుడు. ఆదివారం హీరో రక్షిత్ శెట్టి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను యువ కథానాయకుడు నాని తన వాల్‌పోస్టర్ సినిమా యూ ట్యూబ్ ఛానెల్లో విడుదల చేసి, యూనిట్‌కి అభినందనలు తెలిపారు. జి.ఎస్.గుప్తాతో కలిసి ఈ సినిమాను రక్షిత్ శెట్టి నిర్మించారు. 'ఏంటో ఏమో ఎవరెవరో నిండిన దారుల్లో...' అంటూ సాగే మాంటేజ్ సాంగ్‌లో, కొన్ని పరిస్థితుల కారణంగా చార్లి అనే కుక్క ఓ ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చినప్పుడు, అది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది?, ధర్మ(రక్షిత్ శెట్టి)ని ఎలా కలుసుకుంటుంది?, వీళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత ఏమవుతుంది? అనే అంశాలను ఎలివేట్ చేశారు. అలాగే రక్షిత్ శెట్టి పోషించిన ధర్మ అనే క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. చార్లి, ధర్మ..ఇద్దరూ కలుసుకున్న తర్వాత వారెలాంటి సాహసం చేశారో తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని టీజర్ చెప్పకనే చెప్పింది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.