Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయిక కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' చిత్రాలు రెండూ ఓటీటీలో విడుదలై డిజాస్టర్స్‌గా నిలిచాయి. 'మహానటి' తర్వాత రిలీజైన సినిమాలు కావడం, పైగా మహిళా ప్రధానంగా ఉండటంతో ఈ రెండు సినిమాలపై అటు ప్రేక్షకుల్లోను, ఇటు ఆమె అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేక దారుణ ఫలితాన్ని పొందాయి. ఇక వీటి తర్వాత థియేటర్లలో రిలీజైన 'రంగ్ దే' సినిమా సైతం ప్రేక్షకుల నిరాదరణ పొందింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌లో ఉన్న కీర్తి సురేష్ త్వరలో రిలీజ్ అవ్వబోయే 'గుడ్ లక్ సఖీ' సినిమాపైనే పెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్ప్ బేస్డ్ డ్రామా చిత్రాన్ని జీ5 ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉందని వినిస్తోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట', రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే'లో కీలక పాత్ర పోషిస్తోంది.