Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సర్వే నెం.3'. వాయిజా సినీ క్రియేషన్స్ పతాకంపై డి. రామకష్ణ (ఆర్.కె) దర్శకత్వంలో మేకా హేమసుందర్ (మేకా ప్రసాద్) నిర్మిస్తున్నారు. ఓ ప్రముఖ హీరో గెస్ట్ పాత్రలో నటించనున్న ఈ చిత్రం శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రభాస్ నటించిన 'బిల్లా' చిత్ర నిర్మాత డి. నరేందర్, నిర్మాత బెల్లంకొండ సురేష్ హాజరై చిత్రయూనిట్‌ను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె. మాట్లాడుతూ, 'నిర్మాత హేమసుందర్కి ఈ కథ ఎంతగానో నచ్చి, గ్రాండ్‌గా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం' అని అన్నారు. 'మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాతలు డి. నరేందర్, బెల్లంకొండ సురేష్‌గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు రెండో సినిమా. ఈ కరోనా టైమ్‌లో అసలు సినిమా నిర్మించాలని అనుకోలేదు. కానీ ఈ కథ విన్నాక ఎంతో ఎగ్జైట్ అయ్యాను. ఖచ్చితంగా ఈ కథను ప్రేక్షకులకు అందించాలని అనిపించింది. అందుకే స్టార్ట్ చేశాను. కథానుగుణంగా ఆర్టిస్ట్‌లు కూడా చక్కగా కుదిరారు. ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో గెస్ట్‌గా నటించనున్నారు. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని చెప్పారు. దిల్ రమేష్, విజరు, రమణారెడ్డి, ఇంతియాజ్, రాజేష్ తదిరులు నటించనున్న ఈ చిత్రానికి రచన-సహకారం: కె. మాణిక్యాలరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: పి. రమణారెడ్డి, శ్రీనివాస్, నిర్మాత: మేకా హేమసుందర్, దర్శకత్వం: డి. రామకష్ణ (ఆర్.కె).