Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ స్టార్ హీరోలు టాలీవుడ్లో తమ మార్కెట్‌ని విస్తరించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాని చేసేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. విజయ్ బాటలోనే ధనుష్ కూడా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించబోతున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోయే ఈ సినిమా వివరాలు త్వరలోనే అధికారికంగా రానున్నాయట. ధనుష్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమా 'గ్రే మ్యాన్'లో నటిస్తున్నారు. అలాగే 'జగమే తంత్రమ్' విడుదలకు రెడీగా ఉంది.