Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో ఓ సినిమాని ఎనౌన్స్ చేసిన విషయం విదితమే. లింగుస్వామి మార్క్‌తో పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఉండబోయే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మాధవన్ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ పక్క హీరోగా నటిస్తూనే, మరో పక్క విలన్‌గానూ మాధవన్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇదిలా ఉంటే, రొమాంటిక్ హీరోగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న మాధవన్‌కు యాక్షన్ హీరోగా గుర్తింపు ఇచ్చిన దర్శకుడు లింగుస్వామి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రన్' చిత్రం ఘనవిజయంతో మాధవన్‌కు కమర్షియల్ హీరోగా స్టేటస్ దక్కింది. ఆ తర్వాత లింగుస్వామి తెరకెక్కించిన 'వేట్టై' చిత్రంలోని రెండు పాత్రల్లో ఒక పాత్రని మాధవన్ పోషించారు. మాధవన్ ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో 'రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్' అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేశ దోహ్రం ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.