Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమార్, కష్ణ ప్రియ, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అర్ధ శతాబ్దం'. రవీంద్ పుల్లె దర్శకుడు. ఈనెల 11న ఈ సినిమా ఆహా ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో దర్శకుడు రవీంద్ర పుల్లె మాట్లాడుతూ, 'సమాజంలోని అసమానతలను ఆధారంగా చేసుకుని ఈ కథ రాసుకున్నాను. ఇలాంటి కథను ఆడియెన్స్‌కు నచ్చేలా, ఎలా తెరకెక్కించాలని బాగా ఆలోచించి, అందుకు తగినట్లు నటీనటులను ఎంపిక చేసుకుని, తీసిన సినిమా ఇది. నవీన్ చంద్ర, శుభలేఖ సుధాకర్, సాయికుమార్.. ఇలా ప్రతి పాత్ర చాలా ప్రాముఖ్యతతో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది' అని తెలిపారు.
'ఈ కథ చెప్పడానికి రవీంద్ర నా దగ్గరకు వచ్చినప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేనని చెప్పా. అయితే ఉమేష్ చంద్ర పాత్రను బేస్ చేసుకుని నా పాత్రను డిజైన్ చేశానని చెప్పడంతో నటించడానికి అంగీకరించా. ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ పాత్ర చేశా' అని కథానాయకుడు నవీన్ చంద్ర అన్నారు. నిర్మాత చిట్టి కిరణ్ రామోజు మాట్లాడుతూ, 'నా టీమ్ సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ రవి సినిమాని అద్భుతంగా మలిచాడు. మా సినిమాని రిలీజ్ చేస్తున్న 'ఆహా' యాజమాన్యానికి కృతజ్ఞతలు' అని తెలిపారు. 'ఇందులో దిగువ మధ్య తరగతి కుర్రాడిగా నటించాను. అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. అక్కడ నుంచి అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనేదే ఈ సినిమా' అని కథానాయకుడు కార్తీక్ రత్నం చెప్పారు.