Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజరు, 'మత్తు వదలరా' ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.
టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సజన్ ఎరబోలు నిర్మాతలు. సోమవారం యువ కథానాయకుడు రాహుల్ విజరు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. సుభాష్ పాత్రలో రాహుల్ విజరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ, 'పెళ్లి, కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయాల్లో కచ్చితమైన భావాలు ఉన్న యువకుడు సుభాష్ పాత్రలో రాహుల్ విజరు కనిపిస్తారు. ఈతరం యువతకు పెళ్లి, జీవితాంతం కొనసాగే బంధాలు, బాధ్యతలు వంటి విషయాల్లో ఉండే కన్ఫ్యూజన్ను, క్లారిటీని చూపించే పాత్ర. సింపుల్ అండ్ రొమాంటిక్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు' అని తెలిపారు.
'రాహుల్ విజరుకి మా 'పంచతంత్రం' చిత్రబందం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. సుభాష్‌గా నటిస్తున్న ఆయన పాత్రలో ఇప్పటి యువత తమని తాము చూసుకుంటారు. నేటి యువతరానికి ప్రతినిధి లాంటి సుభాష్ పాత్రలో రాహుల్ విజరు నటన చాలా సహజంగా ఉంటుంది. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్లుక్స్కు సూపర్ రెస్పాన్స్ లభించింది. జూలైలో లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. కేవలం పది రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. లాక్డౌన్లో ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించాం' అని నిర్మాతలు సజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ చెప్పారు. దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: రాజ్ కె. నల్లి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సజన్ ఎరబోలు, రైటర్ - డైరెక్టర్: హర్ష పులిపాక.