Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'కథ కంచికి మనం ఇంటికి'. ఎం.పి.ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా చాణక్య చిన్న దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందీ చిత్రం. మంగళవారం కథానాయకుడు ఆదిత్ అరుణ్ బర్త్‌డే నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు.
ఈ సందర్బంగా నిర్మాత మోనిష్ పత్తిపాటి మాట్లాడుతూ, ''కథ కంచికి మనం ఇంటికి' అనే ఒక అద్బుతమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. దర్శకుడు చాణిక్య చిన్న మాకు చెప్పిన కథ చాలా వైవిధ్యంగా ఉంది. ఆయన చెప్పినప్పుడే ఈ టైటిల్‌ని ఫిక్స్ అయ్యాం. మాకు చెప్పిన దానికంటే కూడా ఆయన చాలా బాగా తెరకెక్కించారు. ఈ కథకి హీరో ఎవరైతే బాగుంటుందని అనుకున్నప్పుడు మేం అందరం ఆదిత్ అరుణే అని ఏకగ్రీవంగా చెప్పాం. ఈ సినిమాలో ఆయన ఫెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రతి సినిమాలోని పాత్రలో ఆయన ఒదిగిపోతారు. క్లైమాక్స్‌లో అదిత్ నటనకి థియేటర్లో ప్రేక్షకులు ఊగిపోవడం ఖాయం. ఈ సినిమాతో ఆయన మా ఫ్యామిలీ మెంబర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా హీరో ఆదిత్ అరుణ్ పుట్టినరోజు సందర్బంగా మా చిత్ర ఫస్ట్‌లుక్‌ని, మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ రావడం మా యూనిట్ మొత్తానికి ఆక్సిజన్‌లాంటి ఉత్సాహాన్నిచ్చింది. మా హీరోకి మేం ఇచ్చిన బర్త్‌డే గిప్ట్ ఇది. హ్యపీ బర్త్‌డే టు అదిత్ అరుణ్. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది' అని చెప్పారు.