Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'డియర్ మేఘ'. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీని సిద్ధం చేసుకుంటున్న ఈ చిత్రానికి ఓటీటీల నుంచి ఫ్యాన్సీ ఆఫర్స్ వెల్లువలా రావడం విశేషం. మంగళవారం హీరో అరుణ్ ఆదిత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. నాయకానాయికలు అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్‌ల ప్రేమానుబంధాన్ని రిప్రజెంట్ చేసేలా ఉన్న ఈ పోస్టర్ అందర్నీ అలరిస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ,' మా హీరో అరుణ్ ఆదిత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో అరుణ్ ఆదిత్ పాత్ర సూపర్‌గా ఉంటుంది. ఆయన నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలతో పోలిస్తే ఆద్యంతం వైవిధ్యభరితంగా మా చిత్రం ఉంటుంది. హీరో, హీరోయిన్ల్ల పాత్రలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. ఓ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మా నిర్మాత అర్జున్ దాస్యన్ ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు' అని అన్నారు.'మా హీరో అరుణ్ ఆదిత్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌కి సర్వత్రా మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా మా చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజారు చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఈ చిత్రకథను దర్శకుడు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సమష్టి కృషితో సినిమా అవుట్‌ఫుట్ సూపర్‌గా వచ్చింది. దీంతో మా చిత్రానికి పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ ఆఫర్లు ఇవ్వడాన్ని మా తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో సహా కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఓ పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం : హరి గౌర, సినిమాటోగ్రాఫర్ : ఐ ఆండ్రూ, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ : పీఎస్ వర్మ, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి