Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలనాటి మేటి నాయిక శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పటికే అనేక వార్తలొచ్చాయి. ఫలానా స్టార్ హీరో సరసన నటించబోతోందంటూ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి జాన్వీ ఎంట్రీ పక్కా అని తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగిడుతూ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన మెరిసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. ఎన్టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందనున్న విషయం విదితమే. ఈచిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీని ఎంపిక చేసినట్టు బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్, జాన్వీల ఫొటో షూట్ కూడా జరగబోతోందని టాక్. ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాతోపాటు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.