Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం 'సూర్యవంశీ', 'రక్షాబంధన్', 'బెల్ బొటమ్', 'పృధ్వీరాజ్', 'బచ్చన్ పాండే', 'అత్రంగిరే', 'రామ్ సేతు' వంటి తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అక్షరుకుమార్ లేటెస్ట్గా మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగల్ ఇచ్చారు. అది కూడా తాను నటించిన ఓ బ్లాక్‌బస్టర్ చిత్రానికి సీక్వెల్ కావడం విశేషం. దేవుళ్ళు, దేవుళ్ళ పేరుతో చేసే వ్యాపారాలు, మూఢ నమ్మకాల వంటి నేపథ్యంలో రూపొందిన వ్యంగ్య వినోదాత్మక డ్రామా చిత్రం 'ఓ మై గాడ్' (ఓఎమ్‌జీ). 2012లో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొంది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దేవుళ్ళు, మూఢ నమ్మకాలు వంటి సున్నిత అంశాల్ని తీసుకున్నప్పటికీ విమర్శకుల్ని సైతం ఈ సినిమా మెప్పించి, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇదే సినిమాని తెలుగులో పవన్‌కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాల గోపాల' పేరుతో రీమేక్ చేశారు. అలాగే కన్నడలో ఉపేంద్ర, సుదీప్ కాంబోలో 'ముకుంద మురారి'గా తెరకెక్కించారు. లేటెస్ట్గా 'ఓ మై గాడ్' చిత్రానికి సీక్వెల్‌ని చేసేందుకు అక్షరు రెడీ అవుతున్నారు. అయితే 'ఓఎమ్‌జీ'లో నటించిన పరేష్ రావల్ బదులు ఈ సినిమాలో పకంజ్ త్రిపాఠి నటించబోతున్నారు. అలాగే దీనికి అమిత్ రారు (రోడ్ టు సంగమ్ ఫేమ్) దర్శకత్వం వహించబోతున్నారట.