Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కళామ తల్లి చేదోడు' కార్యక్రమం ద్వారా సినీ కార్మికులకు నిత్యావసరాలను అందజేస్తున్న నిర్మాతలు దిల్రాజు, యలమంచిలి రవిచంద్ తదితరులు
కరోనా సెకండ్ వేవ్ వల్ల ఉపాధి కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ కార్మికులకు ఆదుకునేందుకు సినీ ప్రముఖులు తమవంతు సాయం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవి చంద్ ఆధ్వర్యంలో 'కళామతల్లి చేదోడు' కార్యక్రమం ద్వారా సినీ కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు.
బుధవారం ఉదయం 9 గంటలకు ఫిల్మ్ ఛాంబర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్లు, డ్రైవర్లు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ వర్కర్లు.. ఇలా దాదాపు 600 మందికి దాదాపు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలను పంపిణీ చేశారు.
'ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట కాలంలో భాగస్వామ్యం కావాలి అనేది మా 'కళామ తల్లి చేదోడు' కార్యక్రమ లక్ష్యం' అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. మరో నిర్మాత యలమంచిలి రవిచంద్ మాట్లాడుతూ,'ప్రస్తుత కష్ట కాలంలో పేద సినీ కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారందరినీ దష్టిలో పెట్టుకుని, వాళ్లని ఆదుకోవాలని ఈ కార్యక్రమం మొదలు పెట్టాం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు వేల మంది సినీ వర్కర్స్ ఉన్నారు. వారందరికీ ఓకేసారి పంపిణీ చేస్తే కోవిడ్ కారణాల దష్టా ఇబ్బందులు వస్తాయని, తొలి విడతగా 600 మంది పేద కార్మికులకు నిత్యావసరాలను అందించాం. మిగిలిన వారందరికీ కూడా దశల వారిగా అందజేస్తాం. సినీ కార్మికులకు సహాయం చేసేందుకు చాలా మంది సినీ ప్రముఖులు ముందుకు రావడం సంతోషంగా ఉంది. అయితే వీళ్ళు అందించే ఆర్థిక సహాయాన్ని మేం సెలెక్ట్ చేసిన సూపర్మార్కెట్లకే అందజేయమని సూచించాం' అని తెలిపారు.
'కరోనా కష్ట కాలంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న అందరికీ తనవంతు సాయంగా యలమంచిలి రవిచంద్ ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను' అని నిర్మాత అజరుకుమార్ అన్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ,'యలమంచిలి రవిచంద్ ఈ కష్ట కాలంలో పేదలకి ఇలాంటి సాయం చేస్తున్నందుకు అభినందనలు' అని చెప్పారు. 'ఈ కరోనా కష్ట కాలంలో తొలిసారి ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేసి, పేదలకు సాయం చేసినందుకు యలమంచిలి రవి చంద్, దిల్ రాజు, చదలవాడ శ్రీనివాసరావుకి ధన్యవాదాలు' అని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. -