Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయనే సంతోషంలో కథానాయిక సాయిపల్లవి ఉంది. ఆమె నటించిన మూడు సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నాయి.
కరోనా లాక్ డౌన్ వల్ల సినిమాల విడుదల పలు మార్లు వాయిదా పడినప్పటికీ ఏదో పక్కాగా ప్లాన్ చేసినట్టు
మూడు సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం అందర్నీ సర్ప్రైజ్ చేస్తోంది.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ఓ డాన్సర్‌గా రాణించే పాత్రలో సాయి పల్లవి నటించింది.
రానాకి జోడిగా సాయిపల్లవి నటించిన చిత్రం 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మావోయిస్ట్‌ని ప్రేమించిన గ్రామీణ యువతి పాత్రని సాయి పల్లవి పోషించింది.
నాని సరసన సాయిపల్లవి నటిస్తున్న చిత్రం
'శ్యామ్ సింగరారు'. కోలకతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలోనూ సాయిపల్లవి మహిళా ప్రాధాన్యత ఉన్న శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. రాబోయే ఆరు నెలల్లో మూడు సినిమాల్లోని మూడు భిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్న సాయిపల్లవికి కరోనా పరిస్థితులు భలేగా కలిసొచ్చాయని వేరే చెప్పక్కర్లేదు.