Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అఖండ' సినిమాలోని బాలకృష్ణ కొత్త స్టిల్ చూసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. బర్త్‌డే గిఫ్ట్ అదిరిందంటూ సోషల్ మీడియా వేదికగా బాలయ్య ఫ్యాన్స్ పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. 'సింహా', 'లెజెండ్' వంటి భారీ బ్లాక్‌బస్టర్స్ తర్వాత బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'అఖండ'.
మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేడు (గురువారం) బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, 'మా హీరో నందమూరి బాలకష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అభిమానులకు పుట్టినరోజు కానుకగా స్టయిలీష్ లుక్‌లో ఉన్న బాలయ్య పోస్టర్ని విడుదల చేశాం. దీనికి సర్వత్రా విశేష స్పందన లభిస్తోంది. పోస్టర్ విడుదలతో నందమూరి అభిమానుల్లో ముందుగానే పుట్టినరోజు సంబరాలు మొదలయ్యాయి. బిబి3 రోర్ పేరుతో విడుదలైన 'అఖండ' టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సష్టిస్తోంది. కేవలం 16రోజుల్లోనే 50మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 50మిలియన్స్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో, అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. వాటిని అందుకునేలా దర్శకుడు బోయపాటి శ్రీను అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. కొద్ది పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అతి త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం. షూటింగ్ కంప్లీట్ అయ్యాక, విడుదల తేదీ ప్రకటిస్తాం. ఓ మంచి శుభముహూర్తాన సినిమాని ప్రేక్షకదేవుళ్ళ ముందుకు తీసుకొస్తాం' అని చెప్పారు. బాలకష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.