Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అయాన్, అక్సర్ ఖాన్, కాంచన హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మకిలి'. ఎల్లో మీడియా క్రియేషన్ బ్యానర్‌పై బాలు ప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో శీనివాస రావు బొజ్జ (బి.ఎస్.చౌదరి) నిర్మిస్తున్నారు. అమ్మాయిలపై జరుగుతున్న హత్యలను అరికట్టాలంటే, తప్పుచేసినవారిని శిక్షించడం కాదు, తప్పు చేయాలనే ఆలోచనలను చంపాలి. 'మకిలి' పట్టిన ఈ సమాజాన్ని రక్తంతో కడగాలి అనే సందేశంతో తీసిన చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18న ఊర్వశి ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. కేవలం 49 రూపాయల టికెట్ ధరతో రిలీజ్ అవుతున్న ఈచిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుతున్నాను' అని నిర్మాత శ్రీనివాసరావు బొజ్జ (బి.ఎస్.చౌదరి) తెలిపారు. ధన్‌రాజ్, విజయభాస్కర్, నూకరాజు, ఆనంద్, డి.వి.నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.నాగేంద్ర కుమార్, మ్యూజిక్: నంద కర్రీ, ఆర్.ఆర్: ప్రక్వల్ క్రిష్, ఎడిటింగ్: రాకేష్ చక్ర, మాటలు: బాలు ప్రసాద్ రెడ్డి, లిరిక్స్: శ్రీపతి, కోరియోగ్రఫీ:జిన్నా, ఫైట్స్: దేవరాజ్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బాలు ప్రసాద్ రెడ్డి.