Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండవ కుమారుడు రత్నకుమార్ కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావడంతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధింత సమస్యలతోనూ బాధ పడుతున్నారు. ఘంటసాల కుమారుడిగా ఇండిస్టీలోకి అడుగుపెట్టిన రత్నకుమార్ డబ్బింగ్ కళాకారుడిగా దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు వాయిస్ అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కత భాషల్లో ఇప్పటివరకూ ఆయన దాదాపు 1090 పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. కార్తిక్, వినోద్ కుమార్, జగపతిబాబు, అర్జున్, అరవింద స్వామి, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌కి ఎక్కవ డబ్బింగ్ చెప్పటం విశేషం. 'వీరుడొక్కడే', 'ఆట ఆరంభం', 'అంబేడ్కర్' చిత్రాలతో పాటు 30 సినిమాలకు పైగా ఆయన మాటలు కూడా అందించారు. అలాగే ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సొంతం చేసుకున్నారు. డబ్బింగ్ కళాకారుడిగా, మాటల రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల రత్నకుమార్ ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 1-