Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిమాన కథానాయకుడు బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఇచ్చిన డబుల్ ధమాకాకి ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గురువారం బాలకృష్ణ పుట్టినరోజు నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆయన సినిమాల తాలూకా అప్డేట్స్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా 'అఖండ' చిత్రానికి సంబంధించి బాలయ్య కొత్త లుక్‌ని పుట్టినరోజుకి ఒక రోజు ముందుగానే రిలీజ్ చేశారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది.
ఇక బాలకృష్ణ హీరోగా నటించబోయే 107వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గురువారం ఎనౌన్స్ చేసింది. ఇటీవల 'క్రాక్'తో భారీ బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. 'నటసింహా బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా 'హంట్ బిగిన్ సూన్' పేరుతో ఉన్న ఇంట్రో వీడియోతో ఈ సినిమాని అధికారికంగా మేకర్స్ పకటించారు. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ వీడియోలో సింహం వేటాడేందుకు సిద్ధమవుతోందని రివీల్ చేశారు. నడిచివస్తున్న సింహంలో బాలకష్ణ ముఖాన్ని చూపిస్తూ, ఈ చిత్రంలో ఆయన శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారని సింబాలిక్‌గా చెప్పారు. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. నందమూరి బాలకష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: గోపిచంద్ మలినేని, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, సంగీతం: థమన్ ఎస్. ఎస్.