Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం 'ఆరన్‌మనై3', 'తుగ్లక్ దర్బార్', 'పక్కా కమర్షియల్', 'థ్యాంక్యూ యు', 'సర్దార్', 'సైతాన్ కా బచ్చా', 'భర్మమ్' వంటి తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాలతో బిజీగా ఉన్న కథానాయిక రాశీఖన్నా. పలు భాషల్లో భిన్న సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ లేటెస్ట్గా ఓ వెబ్‌సిరీస్‌కి గ్రీన్ సిగల్ ఇచ్చింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌తో డిజిటిల్ ఫ్లాట్ఫామ్లోకి అడుగిడటం ఓ విశేషమైతే, అజరు దేవగన్ వంటి స్టార్ హీరో సరసన నటిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కావడం మరో విశేషం. అజరు దేవగన్ కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్'. రాజేష్ మపుస్కర్ దర్శకుడు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, బీబీసీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
ఇప్పటికే ఎన్నో పోలీసు పాత్రల్ని పోషించిన అజరు దేవగన్ ఈ వెబ్ సిరీస్‌లోనూ శక్తివంతమైన పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ వెబ్‌సిరీస్‌లో రాశిఖన్నా తెలివిగల ఉన్నాద సైకో - హంతకురాలిగా కనిపించనుందని సమాచారం.డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. బ్రిటీష్ వెబ్ సిరీస్ 'లూథర్' ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే, 'ఆహా' ఓటీటీ సంస్థ కోసం కూడా రాశీ ఖన్నా మరో థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌కి కూడా పచ్చజెండా ఊపినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మొత్తమీద్మ తమన్నా, కాజల్, సమంత బాటలోనే రాశీ ఖన్నా కూడా ఓటీటీ ప్రేక్షకులకు అతి త్వరలోనే పరిచయం కానుంది.