Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'పచ్చీస్'. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకష్ణ, రామసాయిలు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శ్వేతావర్మ కథానాయిక. అవాస చిత్రం, రాస్తా ఫిల్మ్ బ్యానర్స్ పతాకాలపై కత్తూరి కౌశిక్ కుమార్, రామ సాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రానా విడుదల చేశారు. ట్రైలర్‌లోని సన్నివేశాలు, ఆసక్తి కలిగించే ప్రశ్నలు, దాగి ఉన్న ట్విస్ట్‌లు ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉండేలా దర్శకులు రూపొందించారు. జీవితంలో ఏదో సాధించాలనుకునే ఓ వ్యక్తి అనుకోకుండా ఓ క్రైమ్‌లో చిక్కుకుంటే, అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి?, అతను వాటిని ఎలా పరిష్కరించుకుంటాడు? అనే అంశాల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
'ఈ సినిమా దర్శకద్వయం సాయికష్ణ, రామసాయిలు అందించిన స్క్రీన్ ప్లే, కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ప్రజెంట్ ట్రెండ్‌కి తగినట్టు ఈ చిత్రాన్ని దర్శకద్వయం మలచిన తీరు అందర్నీ ఫిదా అయ్యేలా చేస్తాయి. రెగ్యులర్‌గా వస్తున్న థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మంచి క్వాలిటీతో నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను కథానాయకుడు రానా రిలీజ్ చేయడమే కాకుండా, ఆద్యంతం ఆసక్తికరంగా ఉందంటూ ప్రశంసించారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ, సమ్రాన్ సాయి బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణలు. ఈ సినిమాని ఈ నెల 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది' అని చిత్రయూనిట్ తెలిపింది.
రామ్స్, శ్వేతా వర్మ, జయచంద్ర, రవి వర్మ, కేశవ్ దీపక్, ధ్యాన్‌చంద్ రెడ్డి, శుభలేక సుధాకర్, విశ్వేందర్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్స్: శ్రీకష్ణ, రామసాయి, బ్యానర్స్: ఆవాస చిత్రం, రాస్తా ఫిలింస్, ప్రొడ్యూసర్స్: కౌశిక్ కుమార్ కొత్తూరి, రామసాయి, కో- ప్రొడ్యూసర్: పుష్పక్ జైన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లేబోయిన, రచయిత: శ్రీకష్ణ, డీఓపీ: కార్తిక్, మ్యూజిక్ డైరెక్టర్: సమరాన్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్, ఎడిటర్: రానా ప్రతాప్, సౌండ్ రికార్డిస్టు: అశ్విన్ రాజశేఖర్, కాస్ట్యూమ్స్: రామ్స్, సౌండ్ డిజైన్: నాగార్జున తల్లపల్లి.