Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత నట్టి కుమార్ తనయ నట్టి కరుణ నటిస్తున్న చిత్రం 'డిఎస్‌జె' (దెయ్యంతో సహజీనవం). నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని తొలిపాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా నేడు (శనివారం) విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నట్టి క్రాంతి మాట్లాడుతూ,'మహిళా ప్రధాన సినిమాలు గతంలోనూ చాలా వచ్చి, మంచి విజయం సాధించాయి. అదే కోవలో మా సినిమా కూడా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నట్టి కరుణ నటన సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. సెకెండ్ లీడ్‌లో సుపూర్ణ మాలకర్ నటించారు. కరోనా టైమ్‌లో కూడా ఏంతో ధైర్యంగా కాశ్మీర్‌లోని అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరణ జరిపి, షూటింగ్ పూర్తి చేశాం. అందరి సహకారంతో సినిమాని మంచి క్వాలిటీతో పూర్తి చేశాం. అతిత్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని స్టార్ట్ చేస్తాం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు.'చదువులో బంగారు పతకం సాధించిన ఓ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు?, వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని, ఆ అమ్మాయి ఎలాంటి రివేంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం నడుస్తుంది. నేను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతగా నా తనయుడు నట్టి క్రాంతి, కూతురు నట్టి కరుణ హీరోయిన్గా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురు వేరే సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటూ డేట్స్ ఎడ్జస్ట్ కాకపోయినప్పటికీ ఈ సినిమా షూటింగ్లో ఎక్కువగా సింగిల్ టేక్స్లో నటించినందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. కరోనా టైమ్‌లో కూడా నటీనటులందరు భయపడకుండా మాకు సహరించడం వల్లే ఈ సినిమాని పూర్తి చేయగలిగాం. భిన్న మహిళా ప్రధాన చిత్రంగా ఈ సినిమా అందరి మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను' అని దర్శకుడు నట్టి క్రాంతికుమార్ అన్నారు.
నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్, రాజీవ్, హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సమర్పణ : నట్టి లక్ష్మీ, అనురాగ్ కంచర్ల, నిర్మాత: నట్టి క్రాంతి, కెమెరామెన్: కోటేశ్వర రావు, సంగీతం: రవి శంకర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: కెవి.రమణ, ఫైట్స్: కె.అంజిబాబు,
డైరెక్టర్: నట్టి కుమార్.