Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త చిత్రం 'రాజ రాజ చోర'. మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి తాజాగా 'చోరగాథ' అంటూ బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్‌తో ఓ 2డీ వీడియోను విడుదల చేశారు. ఇందులో 'చోరగాథ' అంటూ గంగవ్వ చెబుతున్న కథ ఆసక్తికరంగా ఉండటం విశేషం. అలాగే ఈనెల 18న ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు కూడా ఈ వీడియోలో తెలిపారు. తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజరు ఘోష్, వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. వేదరామన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విప్లవ్ నిషాదం ఎడిటింగ్ చేస్తున్నారు.