Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'క్రాక్' సినిమాలో జయమ్మగా ప్రేక్షకుల్ని మెప్పించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ లేటెస్ట్గా ఓ బంపర్ ఆఫర్‌ని దక్కించుకుంది. బాలకృష్ణ కొత్త సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. 'క్రాక్', 'నాంది' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సినిమాతో పాటు ప్రస్తుతం 'కట్టేరి', 'పంబన్', 'పిరంతల్ పరాశక్తి', 'కలర్స్', 'యానై', 'లగ్గమ్' వంటి తదితర తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.