Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సర్కారు వారి పాట' షూటింగ్‌ని పున: ప్రారంభించగానే, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను అధికారికంగా ప్రకటిస్తాం' అని చిత్ర యూనిట్ తెలిపింది.
మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని పున: ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ని అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల.