Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నల్లంచు తెల్లచీర'. ఈ చిత్రాన్ని ఊర్వశి ఓటిటి సమర్పణలో, సంధ్య స్టూడియోస్-భీమవరం టాకీస్ పతాకాలపై రవి కనగాల, తుమ్మలపల్లి రామసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భూషణ్, దియా, జెన్నీ, సాయి, కిషోర్ దాస్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.అమర్ కార్య నిర్వాహక నిర్మాత. ''దొంగ మొగుడు', 'అభిలాష', 'ఛాలెంజ్', 'మరణమదంగం', 'రాక్షసుడు' చిత్రాలు చిరంజీవిని మెగాస్టార్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. యండమూరి వీరేంద్రనాథ్‌గారు రాసిన నవలలు ఆధారంగా ఈ సినిమాలు తెరకెక్కి, సంచలన విజయాలు సాధించాయి. ఆయన దర్శకత్వంలో 'నల్లంచు తెర చీర' చిత్రాన్ని నిర్మిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్', 'అగ్నిప్రవేశం', 'దుప్పట్లో మిన్నాగు' చిత్రాల తర్వాత యండమూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఆయన శైలిలో వినూత్నమైన కథ, కథనాలతో ముస్తాబవుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని త్వరలోనే విడుదల చేస్తాం' అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అమీర్, కూర్పు: మీర్, సంగీతం: తాళ్ళూరి నాగరాజు, కార్యనిర్వాహక నిర్మాత: సి.అమర్, సమర్పణ: ఊర్వశి ఓటిటి, నిర్మాతలు: రవి కనగాల-తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.