Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'పక్కా కమర్షియల్'. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బన్నీవాసు నిర్మాత. నేడు (శనివారం) కథానాయకుడు గోపీచంద్ బర్త్‌డే. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ని రిలీజ్ చేసింది. స్టయిలీష్ డాన్స్ మూమెంట్‌తో ప్లజెంట్‌గా ఉన్న ఈ పోస్టర్లో గోపీచంద్ లుక్ అందర్నీ విశేషంగా అలరిస్తోంది.
'గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్' సినిమాని మారుతి తెరకెక్కిస్తున్నారనే వార్త వచ్చిన దగ్గర్నుంచి, అలాగే ఈ టైటిల్‌కు అటు ఇండిస్టీ వర్గాలు, ఇటు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. దీంతోపాటు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కొన్ని కీలక ప్రకటనలను దర్శకుడు మారుతి తనదైన శైలిలో విడుదల చేసిన తీరుకీ టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. జూలై మొదటి వారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. గోపీచంద్ క్యారెక్టర్‌ను దర్శకుడు మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో కూడా గోపీచంద్ చాలా స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. 'భలే భలే మగాడివోరు', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే' వంటి ఘన విజయాలతో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి 'భలేభలే మగాడివోరు', 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు. 'ప్రతి రోజు పండగే' సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపీచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో కథానాయిక రాశీఖన్నా ప్రేక్షకుల్ని మరోమారు మెస్మరైజ్ చేయనుంది. 'జిల్', 'ఆక్సిజన్' చిత్రాల్లో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా నటించింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ చిత్రమిది. ఈ చిత్రానికి జకేస్ బీజారు అందిస్తున్న మ్యూజిక్ ఓ ప్రధాన ఆకర్షణ అవుతుంది' అని చిత్ర బృందం తెలిపింది.