Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ పక్క కథానాయికగా నటిస్తూనే,
అవకాశం దొరికినప్పుడల్లా అగ్ర హీరోల
సినిమాల్లో ప్రాముఖ్యం ఉన్న పాత్రల్ని పోషిస్తూ ఇషా రెబ్బా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇప్పటికీ సరైన సక్సెస్‌ని ఇంకా తన ఖాతాలో వేసుకోలేదు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇషాకి బోల్డెన్ని ఆఫర్లు వస్తాయని ఆశించినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్న ఇషా తాజాగా ఓ బంపర్ ఆఫర్‌ని దక్కించుకుంది. అరవింద స్వామి కీలక పాత్రలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో నాయికగా నటిస్తోంది. తమిళ, మలయాళ భాషల్లో రూపొందే
ఈ చిత్రంలో కుంచాకో బోబన్ కథానాయకుడు.
ఈ సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర గురించి ఇషా మాట్లాడుతూ,'ఇద్దరు స్నేహితుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. దీని కోసం చాలా మేకోవర్ అయ్యాను. తెలుగు ప్రేక్షకులు నన్ను కొత్త అవతారంలో చూడబోతున్నారు. ఈ క్యారెక్టర్లో నన్ను చూసి అందరు షాక్ అవుతారు. త్వరలో గోవాలో జరగబోయే ఫస్ట్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాను'
అని తెలిపింది.