Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బిగ్ బాస్' షోతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు సోహైల్. యాంగ్రీ మ్యాన్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లో సోహైల్ చూపించిన ఆటతీరుతో లక్షలాది మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. తనదైన వ్యక్తితంతో మెగాస్టార్ ప్రశంసలను సొంతం చేసుకున్న ఆయన 'సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్' సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ప్రస్తుతం లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న వారికి రేషన్, భోజన సదుపాయాలు సమకూర్చే పనిలో ఉన్నారు.
సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ గురించి సోహైల్ మాట్లాడుతూ, 'మా సంస్థ ద్వారా ఇప్పటివరకు నాలుగు ఆపరేషన్స్‌ని విజయవంతంగా పూర్తి చేశాం. వాటిల్లో ఒకటి న్యూరో సర్జరీ, కాగా మరో మూడు హార్ట్ ఆపరేషన్స్. ఇప్పటి వరకు 24 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాం. భవిష్యత్‌లో కూడా ఇలానే చేస్తాం. మరికొద్ది రోజుల్లో 100 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లకు నిత్యావసరాలను అందించబోతున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి సపోర్ట్‌గా నిలుస్తున్న సోహిలియన్స్కి ప్రత్యేక కతజ్ఞతలు. మేం చేసే సాయానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి' అని చెప్పారు.