Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల నయా పోస్టర్స్‌తో కథానాయకుడు గోపీచంద్ తన అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్స్‌గా రిలీజైన గోపీచంద్ లుక్స్ ఆయన ఫ్యాన్స్‌తోపాటు అందరినీ అలరిస్తున్నాయి. శనివారం బర్త్‌డే సందర్భంగా 'పక్కా కమర్షియల్' చిత్రం, 'సీటీమార్' చిత్రాలకు సంబంధించి గోపీచంద్ నయా లుక్ పోస్టర్స్‌ని సదరు చిత్ర బృందాలు రిలీజ్ చేశాయి. 'పక్కా కమర్షియల్' చిత్ర పోస్టర్లో స్టయిలీష్ క్లాస్ లుక్‌తో ఉంటే, 'సీటీమార్' చిత్ర పోస్టర్లో విజిల్ వేస్తూ పక్కా మాస్ లుక్‌లో గోపీచంద్ కనిపిస్తున్నారు. ఈ రెండు పోస్టర్ల తీరు చూస్తుంటే రెండు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించడానికి గోపీచంద్ రంగం సిద్ధం చేసుకున్నారని వేరే చెప్పక్కర్లేదు. మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' చిత్రం రూపొందుతుండగా, సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' చిత్రం తెరకెక్కుతోంది. ఆంధ్రా కబడ్డీ జట్టు కోచ్‌గా 'సీటీమార్'లో గోపీచంద్ కనిపించబోతున్నారు. ఇందులో తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌గా మెరవబోతోంది.