Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏమాత్రం ఛాన్స్ దొరికినా సూపర్‌స్టార్ మహేష్
సరసన మరోసారి నటించానికి రెడీగా ఉన్నా.
ఆయనతో కలిసి పని చేయటం కోసం ఆశగా
ఎదురు చూస్తున్నా' అంటూ నాయిక కృతి సనన్
తన మనసులోని మాటని బయట పెట్టింది.
సోషల్ మీడియా వేదికగా అభిమానులతో
జరిపిన ఇంట్రాక్షన్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా మహేష్‌తో మళ్ళీ నటించాలని ఉందని కృతి తెలిపింది.
మహేష్‌తో కలిసి '1.. నేనొక్కడినే' సినిమాలో కృతి నటించింది.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
అలాగే దీని తర్వాత నాగచైతన్యకి జోడీగా నటించిన 'దోచెరు' సినిమా కూడా ప్రేక్షకుల నిరాదరణ పొందటంతో తెలుగులో
కృతికి అవకాశాలు రాలేదు.
అయితే బాలీవుడ్లో మాత్రం
పలు అవకాశాలను దక్కించుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
ఇక లేటెస్ట్గా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్'లో సీతగా నటించే ఛాన్స్ దక్కించుకుంది. తన కెరీర్లో దొరికిన అరుదైన అవకాశంగా 'ఆదిపురుష్'ని భావిస్తున్న కృతి ప్రస్తుతం 'మిమి', 'హమ్ దో హమారా దో', 'బచ్చన్ పాండే', 'భేడియా'
వంటి తదితర చిత్రాల్లో భిన్న
పాత్రలు పోషిస్తోంది.