Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నటిగా ఏడేండ్ల నా ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. ఆటుపోట్లు ఎదురైనప్పటికీ నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంలో సక్సెస్ అయినందుకు మరింత సంతోషంగా ఉంది' అని చెబుతోంది కథానాయిక కైరా అద్వానీ. 2014 జూన్ 13న రిలీజైన 'ఫగ్లీ' చిత్రంతో హీరోయిన్గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన కైరా కెరీర్ ఆదివారంతో 7 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. బాలీవుడ్లో నటించిన 'ఎం.ఎస్. ధోని', 'మెషీన్', 'కళంక్', 'కబీర్ సింగ్', 'గుడ్ న్యూస్', 'లక్ష్మి', 'ఇందూ కీ జవానీ' వంటి తదితర చిత్రాల్లోని భిన్న పాత్రలతో అందరినీ అలరించింది. అలాగే పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది. ఇక 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్‌కి జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. అలాగే రామ్‌చరణ్ సరసన 'వినయ విధేయ రామ' చిత్రంలోనూ మెరిసింది. ప్రస్తుతం 'షేర్షా', 'భూల్ భలయ్యా 2', 'జగ్ జగ్ జియో', 'మిస్టర్ లీలే' వంటి చిత్రాల్లో కైరా నటిస్తోంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కబోతున్న నయా సినిమాలో నాయికగా కైరాని ఎంపిక చేసినట్టు సమాచారం.