Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ గ్రాండ్ సక్సెస్‌తో కథానాయిక సమంతకు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. డిజిటిల్ ఎంట్రీ ఇస్తూ సమంత నటించిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'. మనోజ్ బాజ్‌పేరు, ప్రియమణి, సమంత ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజై విశేష ఆదరణ పొందింది. దీంతో అమెజాన్ సంస్థ మరో
వెబ్ సిరీస్ కోసం సమంతకి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. అలాగే మరో ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సైతం సమంతతో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సమంత ముఖ్యపాత్రధారిణిగా రూపొందబోయే ఈ వెబ్‌సిరీస్ కోసం నెట్‌ఫ్లిక్స్ కూడా ఊహించని
భారీ మొత్తాన్ని సమంతకి ఆఫర్ చేసినట్టు సమాచారం. కథానాయికగా వెండితెరపై తన ప్రత్యేకతను చాటుకున్న సమంత ఓటీటీల్లో సైతం ఇదే పంథాతో ముందుకెళ్ళడం విశేషం.
ప్రస్తుతం గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం' చిత్రంలో సమంత నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్లో సమంత త్వరలోనే పాల్గొనబోతోంది. ఇదిలా ఉంటే, పవన్‌కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే కొత్త సినిమాలోనూ కథానాయికగా సమంతని ఎంపిక చేసినట్టు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.