Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం కారణంగా లెక్కలేనన్ని మరణాలు సంభవించాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మరో ఆలోచన లేకుండా థియేటర్లను స్వచ్చందంగా మూసేశారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గు ముఖం పడుతున్నప్పటికీ కరోనా తాలూకా భయం మాత్రం అందరిలోనూ ఇంకా ఉంది. ఈ నేపథ్యంలో థియేటర్లను ఓపెన్ చేస్తే ప్రేక్షకులు మునుపటిలా వస్తారా లేదా అనే అయోమయంలో మేకర్స్ ఉన్నారు. ఈ అయోమయానికి తెర దించుతూ వైజాగ్‌లోని జగదాంబ థియేటర్ యజమాని ఓ ప్రయత్నం చేశారు. ఆదివారం తన థియేటర్ని ఓపెన్ చేసి 50 శాతం ఆక్యుపెన్సీతో రవితేజ నటించిన 'క్రాక్' చిత్రాన్ని ప్రదర్శించారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాదు థియేటర్లు ఓపెన్ చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా వస్తారనే భరోసాని కూడా ఇచ్చింది. దీన్నొక శుభసూచికంగా భావిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లను త్వరలోనే ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు రంగం సిద్ధం చేస్తున్నారు.