Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త కంటెంట్‌ని, నూతన ప్రతిభను ప్రోత్సహించటానికి నాని కూడా నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌ని స్థాపించి, ఇప్పటికే ఆయన రెండు చిత్రాలను నిర్మించారు. 'అ..!', 'హిట్' వంటి సినిమాలు ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాల్ని అందుకున్నాయి. 'అ..!' చిత్రం జాతీయ అవార్డుని సొంతం చేసుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసల్నీ పొందింది. ఇటీవల 'హిట్' సీక్వెల్‌ని అడివిశేష్‌తో ప్రారంభించారు. ఇదిలాఉంటే, సోమవారం మరో కొత్త సినిమాని స్టార్ట్ చేశారు. తన సోదరి దీప్తి దర్శకత్వంలో 'మీట్ క్యూట్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా నాని అభిమానులతో షేర్ చేస్తూ, ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం అని పేర్కొన్నారు. ఇందులో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చిత్ర బృందం తెలియజేయనుంది. ఇక కథానాయకుడిగా నాని ప్రస్తుతం 'టక్ జగదీష్', 'శ్యామ్ సింగరారు', 'అంటే.. సుందరానికీ..' వంటి తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల షూటింగ్‌లు కూడా త్వరలోనే ఆరంభం కానున్నాయి.